
మధ్యప్రదేశ్‌లో కల్తీ దగ్గు మందు బీభత్సం.. 22 మంది చిన్నారుల మృతి, ఫార్మా కంపెనీ యజమాని అరెస్ట్!
మధ్యప్రదేశ్ రాష్ట్రం మరోసారి కల్తీ మందుల బారిన పడింది. ఛింద్వాడా జిల్లాలో పిల్లలకు ఇచ్చిన దగ్గు మందు కారణంగా చోటుచేసుకున్న విషాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా మరో చిన్నారి మయాంక్ సూర్యవంశీ మృతి చెందడంతో, మరణాల సంఖ్య 22కి చేరింది. ఐదేళ్ల మయాంక్ నాగ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, కిడ్నీలు పూర్తిగా విఫలం కావడం ఇందుకు కారణమని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు కారణమైంది తమిళనాడుకు చెందిన శ్రీశన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన ‘కోల్డ్రిఫ్’ అనే…