
కర్ణాటకలో పదో తరగతికి పాస్ మార్క్ 33గా తగ్గింపు
కర్ణాటక విద్యార్థులకు శుభవార్త. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పాస్ కావడానికి కావాల్సిన కనీస మార్కులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కులు అవసరమవుతుండగా, ఇకపై 33 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందని విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ప్రకటించారు. ఈ మార్పు ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులను చదువు మధ్యలో ఆపకుండా ముందుకు తీసుకెళ్లడమే. “కేవలం ఒకటి…