బంగ్లాదేశ్ అల్లర్ల వెనక చైనా కుట్ర

బంగ్లాదేశ్ అల్లర్ల వెనక చైనా కుట్ర?

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ఇటీవల తలెత్తిన రాజకీయ సంక్షోభం, అల్లర్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. రిజర్వేషన్ల అంశం దేశాన్ని కుదిపేసి చివరికి ఆందోళనలు షేక్ హసీనా ప్రధానమంత్రి పీఠాన్నే కదిలించాయి. దీంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో సైన్యం ఆదేశాలతో భారత్ వచ్చి ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె మన దేశంలోనే ఉన్నారు.  బంగ్లాదేశ్ అల్లర్ల వెనక ఎవరో ఉన్నారన్న వార్తలు ఇటీవల వెలువడ్డాయి. చైనానే ఆ దేశాన్ని రెచ్చగొట్టి మనకు పక్కలో బల్లెంలా మారుస్తోందన్న కథనాలు తెరపైకి…

Read More

ఉక్రెయిన్-రష్యా యుద్ధం. కుర్స్క్‌లో భీకర దాడులు

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటోంది. ఉక్రెయిన్ అనుకూల దళాలు రష్యా కుర్స్క్‌లోని నైరుతి ప్రాంతంలోకి ప్రవేశించాయి. ట్యాంకులు, సాయుధ దళాలతో అవి సరిహద్దును దాటినట్టు రష్యా తెలిపింది. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ చేస్తున్న దాడిని తిప్పికొడుతున్నామని, భీకర యుద్ధం జరుగుతోందని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ సైనికులు ఇంత పెద్ద ఎత్తున రష్యాలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ ప్రయోగించిన రెండు క్షిపణులను తమ వాయు రక్షణ సంస్థ కూల్చివేసినట్టు  కుర్స్క్…

Read More

నేపాల్‌లో వరుస విమాన ప్రమాదాలు. తాజా హెలికాఫ్టర్ ప్రమాదం ఐదు మృతులు

నేపాల్ లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను చైనాకు చెందిన వారిగా గుర్తించారు. ఇటీవల (గత నెల చివరి వారంలో)  త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలి, 18…

Read More

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను అరెస్టు చేసి అప్పగించాలంటూ భారత్‌కు డిమాండ్లు

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను అప్పగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. షేక్ హసీనాను అరెస్ట్ చేసి ఆమెను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్టు చేయాలని అన్నారు. బంగ్లాదేశ్‌లో మరణాలకు షేక్ హసీనా బాధ్యత వహించాలని…

Read More

బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటా ఉద్యమం. షేక్ హసీనా రాజీనామా, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రిజ‌ర్వేష‌న్ కోటా వ్య‌తిరేక ఉద్య‌మం తీవ్రం కావ‌డంతో ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం ఆమె దేశం విడిచి వెళ్ల‌డంతో తాత్కాలిక ప్ర‌భుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు మ‌హ్మ‌ద్ ష‌హ‌బుద్దీన్ సోమ‌వారం రాత్రి ఆమోదం తెలిపారు. దాంతో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చిన‌ట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.  విద్యార్థి నాయకులు నహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహమూద్, అబ…

Read More

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటా సంక్షోభం. షేక్ హసీనా రాజీనామా, అఖిలపక్ష సమావేశం

రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్‌‌లో సంక్షోభం సృష్టించింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా నిన్న (సోమవారం) రాజీనామా చేశారు. భద్రత కోసం ఆమె హుటాహుటిన భారత్‌కు వచ్చారు. పొరుగు దేశంలో అకస్మాత్తుగా ఏర్పడిన ఈ సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉందంటూ అన్ని పార్టీలకు సమాచారం…

Read More