నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

జువ్వలదిన్నెలో కొత్త ఫిషింగ్ హార్బర్ ప్రారంభం

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం వర్చువల్ గా ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మత్స్యకారుల జీవితాల్లో ఈ ఫిషింగ్ హార్బర్ వెలుగులు నింపాలని, పరోక్షంగా ఎంతోమందికి ఈ హార్బర్ బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.  కాగా, జువ్వలదిన్నెలో నిర్మించిన ఈ ఫిషింగ్ హార్బర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అతి పెద్దది. ఈ ఫిషింగ్ హార్బర్ కు…

Read More
పాక్‌తో చర్చల కాలం ముగిసిందని స్పష్టం చేసిన జైశంకర్, ఉగ్రవాద చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. జర్మనీలో చిన్నారి దుర్భర పరిస్థితిపై తల్లిదండ్రులను భారత్‌కు పంపేందుకు హామీ ఇచ్చారు.

జైశంకర్ పాక్, జర్మనీ అంశాలపై కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌తో చర్చలు జరిపే అంశంపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పాక్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందని ఆయన స్పష్టం చేశారు. పాక్ మనతో ఎలా వ్యవహరిస్తే మనమూ ఆ దేశంతో అలాగే వ్యవహరిస్తామని పేర్కొన్నారు. పాక్‌కు తగిన విధంగా బదులిస్తామన్నారు. పాక్ ఉగ్రవాద చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్…

Read More
బంగ్లాదేశ్‌లో ఆందోళనలలో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. 400 మందికి పైగా చూపు కోల్పోయారు.

బంగ్లాదేశ్ అల్లర్లలో 1,000 మంది మృతి

షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవ‌ల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌లో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ దేశంలోని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వెల్ల‌డించింది. ఢాకాలోని రాజర్‌బాగ్‌లో ఉన్న‌ సెంట్రల్ పోలీస్ ఆసుపత్రిని సందర్శించిన ఆరోగ్య సలహాదారు నూర్జహాన్ బేగం ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అలాగే నిర‌స‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టే క్ర‌మంలో పోలీసుల చర్య కారణంగా 400 మందికి పైగా విద్యార్థులు, సామాన్య‌ ప్రజలు తమ కంటిచూపును కోల్పోయారని తెలిపారు. కొందరికి ఒక…

Read More
ఇంగ్లండ్‌ బ్యాటర్‌ డేవిడ్ మలన్ 2023 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి పెట్టనున్నాడని సమాచారం.

ఇంగ్లండ్‌ స్టార్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 2017లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, ఆ త‌ర్వాత అన‌తికాలంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం ద‌క్కించుకున్నాడు. చాలా కాలంపాటు అగ్ర‌స్థానంలో కొన‌సాగాడు కూడా.  2022లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ విజేతగా నిల‌వ‌డంలో మలన్ కీరోల్ పోషించాడు. ఇంగ్లండ్ తరఫున 62 టీ20లు ఆడిన అత‌డు 16…

Read More
హత్య కేసు ఎదుర్కొంటున్న షకీబల్‌ హసన్‌పై బీసీబీ క్లియరెన్స్ ఇచ్చింది. దోషిగా తేలేవరకు జట్టులో కొనసాగుతాడని, న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించింది.

షకీబల్‌ హసన్‌కి బీసీబీ నుండి క్లియరెన్స్

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో హత్య కేసు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హసన్‌ కి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నుంచి క్లియరెన్స్ లభించింది. అతడిపై నమోదైనది ఎఫ్ఐఆర్ మాత్రమేనని, దోషిగా తేలి శిక్ష పడితే అప్పుడు చూద్దామని బోర్డు పేర్కొంది. ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ జట్టులో సభ్యుడిగా ఉన్న షకీబల్‌ను త్వరలో భారత్‌లో పర్యటించనున్న జట్టులోనూ కొనసాగించాలని బీసీబీ నిర్ణయించింది. ఇటీవల హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన రూబెల్…

Read More
కెనడా కొత్త వలస విధానం 70,000 భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టడంతో, వారు నిరసనలకు దిగుతున్నారు.

కెనడా వలస విధానంఫై భారత విద్యార్థుల్లో ఆందోళనలు

కెనడా ప్రభుత్వం ఇటీవ‌ల‌ తీసుకొచ్చిన నూత‌న‌ వలస విధానంపై ఆ దేశంలో ఉంటున్న‌ భారతీయ విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తమను వెనక్కి పంపుతారేమోననే ఆందోళనతో భారతీయ విద్యార్థులు కెనడా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిర‌స‌న కార్యక్రమాలు చేపడుతున్నారు.  కాగా, ఎన్‌డీటీవీ నివేదిక ప్ర‌కారం ప్రస్తుతం కెనడా తెచ్చిన కొత్త‌ వలస విధానంతో దాదాపు 70వేల‌ మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమను వెనక్కి పంపుతారనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. దాంతో వాళ్లు ఆందోళనలకు…

Read More
ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2025లో దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను 2.7 లక్షలకు తగ్గించింది.

ఆస్ట్రేలియాలో భారతియ విద్యార్థుల సంఖ్య పరిమితి

ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ఒకటైన ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2025లో దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను 2.7 లక్షలకు తగ్గించింది. రికార్డు స్థాయిలో వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఇళ్ల అద్దెల కట్టడికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిమితం చేయనున్న సీట్లకు సంబంధించి ఉన్నత విద్యా కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, ట్రైనింగ్ కోర్సులు కూడా ఉన్నాయని ఆస్ట్రేలియా విద్యా మంత్రి…

Read More