ట్రంప్ ప్రశంసలు పొందిన ఇటలీ ప్రధాని మెలొని
ఇటలీ ప్రధాని జార్జియా మెలొనిని అద్భుతమైన మహిళ అంటూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. శనివారం ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో ఎస్టేట్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం సందర్భంగా మెలొనితో డిన్నర్ చేసిన ట్రంప్, ‘ది ఈస్ట్ మన్ డైలమా’ డాక్యుమెంటరీ సినిమా కూడా చూశారని అమెరికా మీడియా వెల్లడించింది. ‘ది ఈస్ట్ మన్ డైలమా’ 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌కు అనుకూలంగా ఫలితాలను మార్చేందుకు…
