భండారాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
మహారాష్ట్ర భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. పేలుడు శబ్దం 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు వర్కర్లు ప్రాణాలు కోల్పోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. పేలుడు అనంతరం భారీగా పొగ, మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటన చోటుచేసుకున్న ప్రదేశంలో దాదాపు 12 మంది వర్కర్లు…
