చట్ట విరుద్ధ నిరసనలు – విద్యాసంస్థలకు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన చట్టవిరుద్ధ నిరసనలు ప్రోత్సహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నిరసనలు అనుమతించే కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు కేంద్రం నిధులను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటన విద్యా రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. అంతేకాకుండా, చట్ట విరుద్ధ నిరసనలకు పాల్పడే విద్యార్థులకు కఠిన శిక్షలు అమలు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. నిరసనల తీవ్రతను బట్టి విద్యార్థులను శాశ్వతంగా…
