పాక్ ఆక్రమిత కశ్మీర్ పై భారత్ కఠిన హెచ్చరిక
పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను నిందించే ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. అయితే, ప్రతిసారీ భారత్ దిమ్మతిరిగే సమాధానం ఇవ్వడంతో పాక్ కుట్రలు విఫలమవుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు. దీనిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్రంగా స్పందించారు. హరీశ్ మాట్లాడుతూ పాకిస్థాన్ అనవసర విషయాలను లేవనెత్తుతోందని, పదేపదే అవాస్తవ వాదనలు చేయడం వల్ల అవి నిజమవు అని తేల్చిచెప్పారు. పాక్ అక్రమంగా…
