ఖైదీలకు ఏకాంత ములాఖత్‌లకు ఇటలీ గ్రీన్ సిగ్నల్
ఖైదీల సంక్షేమం, కుటుంబ హక్కుల పరిరక్షణ దిశగా ఇటలీ ప్రభుత్వం చారిత్రాత్మకమైన మార్గదర్శకాలను ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం, జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తమ జీవిత భాగస్వాములతో నెలకు కనీసం నాలుగు సార్లు ములాఖత్ చేసుకునే హక్కును పొందారు. అంతేకాదు, ప్రతి ఆరు వారాలకు ఒకసారి గంటపాటు ఏకాంతంగా గడిపే అవకాశం కూడా కల్పించనున్నారు. ఇప్పటివరకు జైళ్లలో జరిగే ములాఖత్‌లు అధికారుల పర్యవేక్షణలో, పరిమిత సమయంతో మాత్రమే ఉండేవి. ఖైదీలు తమ జీవిత భాగస్వాములతో స్వేచ్ఛగా…
