Pahalgam attack forces postponement of Bollywood Big One event in London; Salman Khan apologizes to fans and promises new dates soon.

పహల్గామ్ ప్రభావంతో బాలీవుడ్ ఈవెంట్ వాయిదా

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం బాలీవుడ్ పరిశ్రమపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మే 4, 5 తేదీలలో లండన్‌లో జరగాల్సిన ‘బాలీవుడ్ బిగ్ వన్’ కార్యక్రమాన్ని నిర్వాహకులు తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈవెంట్ వాయిదా వెనుక కారణాలను వివరించిన సల్మాన్ ఖాన్, పహల్గామ్ ఘటన వల్ల ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లో అభిమానుల భద్రతను దృష్టిలో…

Read More
Fearing Indian retaliation, Pakistan deploys radar near LoC and continues to violate ceasefire despite no provocation from India.

భారత దాడులకు భయపడుతున్న పాక్ కదలికలు

పహల్గామ్ దాడి తర్వాత భారత్ వైపు నుంచి ప్రతీకార చర్యలు తప్పవని అంచనా వేస్తున్న పాకిస్థాన్ గజగజ వణికిపోతోంది. భారత ఆర్మీ కదలికలను ముందుగా గుర్తించేందుకు ఎల్‌వోసీ వెంబడి పలు రహస్య చర్యలు చేపట్టింది. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం, భారత్ వైమానిక దాడులు చేస్తుందన్న భయంతో పాక్ తన రాడార్ వ్యవస్థలను ముందంజలో తేవడానికి ప్రయత్నిస్తోంది. సియోల్ కోట్ సెక్టార్‌లో పలు ప్రాంతాలకు రాడార్ వ్యవస్థలను తరలిస్తుండగా, ఫిరోజ్‌పూర్ సెక్టార్ ఎదురుగా భారత్ కదలికలను పసిగట్టేందుకు…

Read More
Investigations confirm Pakistan Army link in Pahalgam attack; terrorist Hashim Moosa was trained as a Pak para commando.

పహల్గామ్ దాడికి పాక్ సంబంధం బయటికొచ్చింది

పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన హషీమ్ మూసా అనే ఉగ్రవాది పాక్ పారా కమాండోగా పనిచేశాడని సైనిక వర్గాలు వెల్లడించాయి. అతడు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థతో కలిసి పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం అందింది. మూసాతో పాటు అరెస్ట్ చేసిన 15 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లు కూడా అతడి సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారు. ఆయనకు పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ శిక్షణ ఇచ్చిందని, కోవర్ట్…

Read More
A US Navy Super Hornet fighter jet fell into the Red Sea; all crew members are safe, and a high-level investigation is underway.

యూఎస్ నేవీ సూపర్ హార్నెట్ సముద్రంలో పడింది

అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్‌ఎస్ హ్యారీ ఎస్ ట్రూమన్ విమానవాహక నౌకపై జరిగిన గందరగోళ ఘటనలో, విలువైన ఎఫ్/ఏ-18ఈ సూపర్ హార్నెట్ యుద్ధ విమానం ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయింది. ఏప్రిల్ 28న ఎర్ర సముద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన యూఎస్ నేవీ అధికారికంగా ధృవీకరించింది. దాదాపు 476 కోట్ల విలువైన ఈ విమానం నౌక హ్యాంగర్ బేలో టోయింగ్ జరుగుతుండగా నియంత్రణ కోల్పోయింది. యెమెన్ హౌతీ రెబల్స్ క్షిపణి, డ్రోన్ దాడుల నుండి తప్పించుకునేందుకు యూఎస్‌ఎస్ ట్రూమన్…

Read More
India hit back hard at Pakistan in the UN, highlighting their minister’s own admission of supporting and training terror groups.

ఐరాస వేదికగా పాక్‌ను బలంగా ఎదుర్కొన్న భారత్

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాకిస్థాన్‌ను తీవ్రంగా నిలదీసింది. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, వాటికి శిక్షణ, నిధులు సమకూర్చడం వంటి విషయాలను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించిన విషయాన్ని భారత్ బలంగా ప్రస్తావించింది. పాక్ ఈ వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ మండిపడింది. భారత డిప్యూటీ పర్మినెంట్ రెప్రజెంటేటివ్ యోజన పటేల్ మాట్లాడుతూ, “ఐరాస వేదికను ఉపయోగించి భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడం పాకిస్థాన్ యొక్క బాధ్యతారాహిత్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు….

Read More
After Kashmir attack, India cancels visas of Pakistani nationals, orders them to leave the country by April 29 amid heightened security concerns.

పాక్ పౌరుల వీసాలు రద్దు, కేంద్రం కీలక నిర్ణయం

కశ్మీర్‌లో పహల్గామ్ ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసి, వారిని వెంటనే స్వదేశానికి పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. పాక్ పౌరులు ఏప్రిల్ 29వ తేదీలోపు భారత్ విడిచి వెళ్లాల్సిందిగా స్పష్టం చేసింది. వైద్య వీసాలతో ఉన్నవారికీ ఇదే గడువు వర్తించనుందని తెలిపింది. గడువు దాటిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని…

Read More
Following the Kashmir attack, Pakistan has deployed powerful Chinese weapons near the Indian border, escalating military tensions.

పాకిస్థాన్ సరిహద్దులో చైనా ఆయుధాలు

కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన దాడి మరియు ఆపై సరిహద్దుల్లో జరిగిన కాల్పుల నేపథ్యంతో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, పాకిస్థాన్ సైన్యం కీలక సైనిక చర్యలకు ఉపక్రమించింది. చైనా నుంచి సేకరించిన శక్తివంతమైన ఎస్ హెచ్-15 సెల్ఫ్-ప్రొపెల్డ్ ఆర్టిలరీ (స్వయంచోదక శతఘ్ని) వ్యవస్థలను పాకిస్థాన్ సరిహద్దు సమీప ప్రాంతాలకు తరలించింది. ఈ ఆయుధాల మోహరింపు భారత భద్రతా దళాలకు పెద్ద ఆందోళన కలిగించగా, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను మరింత ఉద్రిక్తతగా మార్చింది….

Read More