 
        
            “పశ్చిమ బెంగాల్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్‌కు షాక్ – చొరబాటుదారుల దాడి, అపహరణ”
పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ (BSF) జవాన్‌పై తీవ్ర దాడి జరిగింది. చొరబాటుదారులను అడ్డుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని దుండగులు ఆ జవాన్‌పై విరుచుకుపడి అతడిని అపహరించారు.ఈ ఘటన సోమవారం తెల్లవారుఝామున చోటుచేసుకుంది. సరిహద్దు గస్తీలో భాగంగా విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్, అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశ్ చొరబాటుదారులను నిలువరిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.పలు గంటలపాటు అతడిని బంధించిన అనంతరం, స్థానిక గ్రామస్తుల మరియు బీఎస్ఎఫ్ అధికారుల ఒత్తిడితో చొరబాటుదారులు…

 
         
         
         
         
        