
డీఆర్‌డీఓ ‘ధ్వని’ క్షిపణి పరీక్షలకు సిద్ధం – బ్రహ్మోస్ కంటే శక్తిమంతం!
భారత రక్షణ రంగాన్ని కొత్త శిఖరాలవైపు తీసుకెళ్లే కీలకమైన పరిణామం ‘ధ్వని’ రూపంలో మలుపుతిరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన బ్రహ్మోస్ క్షిపణికి మించి శక్తిమంతమైన హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్‌ను (HGV) దేశీయంగా అభివృద్ధి చేస్తూ, ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయి ప్రయోగాలకు సిద్ధమవుతోంది డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO). ‘ధ్వని’ అనే పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ గ్లైడ్ వెహికల్ గంటకు 7,000 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి…