
వేడి ఆహారం తినాలనే కారణాలు చెప్పిన నిపుణులు
కొన్ని ఆహార పదార్థాలను వేడి చేయకుండా తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అన్నం, మాంసాహారం, పాస్తా, పిజ్జా వంటివి వేడి చేసుకుని తింటేనే రుచిగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి కూడా మంచిదని సూచిస్తున్నారు. చల్లబడ్డ ఆహారంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, వాటిని తినడం ప్రమాదకరమని చెబుతున్నారు. అన్నం చల్లారిపోయిన వెంటనే దానిలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అన్నం వేడి అయినప్పుడు తినడం ఉత్తమమని సూచిస్తున్నారు….