
కంటికి స్క్రూడ్రైవర్ దిగినా ప్రమాదం తప్పిన యువకుడు
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలానికి చెందిన రంజిత్ (21) ప్రైవేట్‌గా విద్యుత్తు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8న గ్రామంలో విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ స్క్రూడ్రైవర్ అతని కుడి కంటి పైభాగంలో బలంగా దిగింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు, అతని కుటుంబ సభ్యులు రంజిత్‌ను తక్షణమే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనలతో ముందుగా నిమ్స్‌కు, ఆపై గాంధీ ఆసుపత్రికి ఈ నెల 10న రంజిత్‌ను తరలించారు….