
దగ్గు మందు మరణాలపై సీబీఐ విచారణ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో దగ్గు మందు సేవించిన చిన్నారులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది విశాల్ తివారి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. మొదట ధర్మాసనం ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసేందుకు అంగీకరించినప్పటికీ, కేసు పరిశీలన అనంతరం సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో…