తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో డీఈఓ, ఎంఈఓ, తహసీల్దార్‌ల ఫోన్ నంబర్లు ప్రదర్శించబడటంతో, ఏదైనా సమస్యలుంటే వెంటనే సమాచారం అందించవచ్చని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులను ప్రవేశపెట్టమని అధికారులు స్పష్టం…
