
ఫోన్ ట్యాపింగ్ కేసు – నిందితులకు రెడ్ కార్నర్ నోటీసు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన నిందితులను విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకరరావు, మరో నిందితుడు అరువెల్ల శ్రవణ్‌రావులపై ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి దీనిపై సమాచారం అందింది. విదేశాల్లో తలదాచుకున్న నిందితులను తీసుకురావడానికి కేంద్ర హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు….