
క్యాన్సర్ బాధతో భార్యను హత్య చేసి బలవన్మరణం
ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో బుధవారం జరిగిన విషాద ఘటన మానవీయ సంఘటనగా మారింది. క్యాన్సర్ బారిన పడి, తిరిగి కోలుకునే ఆశ లేకపోవడంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్యను కాల్చిచంపి, తానే తనువు చాలించాడు. కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఘజియాబాద్ సిటీకి చెందిన కుల్ దీప్ త్యాగి (46) ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. వైద్యుల ప్రకారం చికిత్సకు భారీ ఖర్చు అవసరమవుతుందని, కోలుకునే అవకాశం తక్కువేనని…