చెడ్డీగ్యాంగ్ మాలెగావ్‌లో దొంగతనం
నిన్నమొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలను భయకంపితులను చేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు మహారాష్ట్రలో వాలింది. నాసిక్‌లోని మాలెగావ్‌లో ఓ ఇంటితోపాటు కాలేజీలోకి చొరబడిన దొంగలు రూ. 5 లక్షల విలువైన 70 గ్రాముల బంగారంతోపాటు అరటిపండ్లను ఎత్తుకెళ్లారు. చెడ్డీ, బనియన్ ధరించిన దొంగలు ఆవరణలోకి ప్రవేశించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. మాలెగావ్‌లో నిన్నమొన్నటి వరకు ‘గౌన్‌గ్యాంగ్’ హల్‌చల్ చేయగా, ఇప్పుడు చెడ్డీగ్యాంగ్ రంగంలోకి దిగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గౌన్‌గ్యాంగ్ సభ్యులు మహిళల గౌన్లు ధరించి…
