
మావోయిస్టు లొంగుబాటు – చింతూరులో పోలీసుల ప్రకటన
చింతూరు డివిజన్ కేంద్రంలో మావోయిస్టు కూరం సంతు లొంగుబాటును పోలీసులు ప్రకటించారు. రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ ఆడహల్లి, చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా లొంగుబాటు వివరాలను మీడియాకు వెల్లడించారు. కూరం సంతు గతంలో మిలిసియా సభ్యులతో కలిసి చత్తీస్‌గఢ్ ప్రాంతంలో దాడులకు పాల్పడ్డాడు. రెండు టాటా మ్యాజిక్ వాహనాలను దహనం చేయడంతో పాటు ఐఈడీ అమర్చిన ఘటనల్లో పాల్గొన్నాడు. మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి, ప్రభుత్వ పరివర్తన కార్యక్రమాలతో ప్రభావితమై జనజీవన స్రవంతిలో కలవాలని కూరం…