
హుజురాబాద్‌లో దొంగలు బీభత్సం, వృద్ధ దంపతులపై దాడి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. ప్రతాపవాడలో ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడి, కత్తులతో బెదిరించి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. 80 తులాల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు, ఇంటి యజమాని రాఘవరెడ్డి దంపతులపై దాడి చేశారు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. దొంగతనం జరిగే ముందు దుండగులు ఇంటి ముందు ఉన్న నీటి మోటార్ ఆన్ చేసి, ట్యాంక్ నిండిన నీళ్లు…