
తెనాలి కటేవరం వద్ద దారుణం.. ప్రయాణికుడిపై కత్తి దాడి!
తెనాలి మండలం కటేవరం గ్రామం వద్ద అర్ధరాత్రి దారుణం జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆటోలో ప్రయాణికుడి మాదిరిగా ఎక్కి, అశోక్ కుమార్ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. అతని వద్ద ఉన్న రూ. 11,000 నగదును లూటీ చేసి పరారయ్యాడు. ఈ దాడితో అశోక్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు డ్వాక్రా డబ్బులు కడదామని బయటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అతని గొంతు, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం…