భారత్-చైనా మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. 2020 గాల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో, మళ్లీ విమాన రాకపోకలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, త్వరలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల మధ్య చర్చలు పూర్తయినట్టు సమాచారం. ప్రారంభ దశలో మినిమమ్ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో ఉద్యోగం, చదువు, వ్యాపార అవసరాల కోసం ఉండే భారతీయులు ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. అలాగే, చైనాలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు కూడా భారత్‌లోకి రాకపోకలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య యాత్రా సంబంధాలను పునరుద్ధరించేందుకు కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే, రాజకీయంగా ఇంకా పలు సమస్యలు ఉన్నప్పటికీ, ఈ విమాన సర్వీసుల పునఃప్రారంభం ద్వైపాక్షిక నమ్మకాన్ని పెంచే అవకాశంగా భావిస్తున్నారు విశ్లేషకులు. మొదటి దశలో ఢిల్లీ – బీజింగ్, ముంబయి – గ్వాంగ్‌జౌ, చెన్నై – షాంఘై మధ్య విమానాలు నడిపే అవకాశం ఉన్నట్టు సమాచారం.

భారత్ – చైనా మధ్య మళ్లీ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

భారత్-చైనా మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. 2020 గాల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో, మళ్లీ విమాన రాకపోకలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, త్వరలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల మధ్య చర్చలు పూర్తయినట్టు సమాచారం. ప్రారంభ దశలో మినిమమ్ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో…

Read More