బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటా ఉద్యమం. షేక్ హసీనా రాజీనామా, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా వ్యతిరేక ఉద్యమం తీవ్రం కావడంతో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె దేశం విడిచి వెళ్లడంతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సోమవారం రాత్రి ఆమోదం తెలిపారు. దాంతో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. విద్యార్థి నాయకులు నహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహమూద్, అబ…