
ఏపీలో గోదావరి, కృష్ణా నదుల వరద ఉద్ధృతి: ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు అప్రమత్తం
ఏపీ రాష్ట్రంలో ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. వరద ప్రవాహం పెరుగుతూ ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరాయని అధికారులు వెల్లడించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. గోదావరి నది భద్రాచలం వద్ద 44.9 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీలో ప్రస్తుతం 9.88 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, అదే స్థాయిలో ఔట్ ఫ్లో…