
జమ్మి చెట్టు నాటి పెంచాలని గ్రీన్ క్లైమేట్ టీం పిలుపు
జమ్మి చెట్టు నాటి పెంచండి, ఆరోగ్యంగా జీవించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. సోమవారం ఉదయం ఎంవిపి కాలనీ లో కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. గడిచిన 10 రోజులుగా విజయదశమి వేడుకల్లో భాగంగా జమ్మి చెట్టు నాటి పెంచండి, పూజించండి అని ప్రచారం చేస్తూ వెయ్యి మొక్కలు పంపిణీ చేసామన్నారు. ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా నగరంలోని ప్రముఖ వ్యక్తులతొ జమ్మిచెట్టు మొక్కలు నాటించడం…