 
        
            టిటిడి ఉద్యోగిపై దౌర్జన్యం – సిపిఎం తీవ్ర వ్యతిరేకత
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దౌర్జన్యం చేయడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. భక్తులు, ఉద్యోగుల సమక్షంలోనే టిటిడి ఉద్యోగి బాలాజీపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, అతడిపై దౌర్జన్యానికి పాల్పడటం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. భక్తుల దేవాలయాన్ని వ్యక్తిగత సంపత్తిగా భావించి, తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉద్యోగులను అవమానించడం తగదని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ కుమార్‌ను టిటిడి బోర్డు సభ్యత్వం నుంచి వెంటనే తొలగించాలని, అతనిపై కఠిన…

 
         
         
         
         
        