TTD EO Shyamal Rao suspended senior assistant Krishna Kumar for misappropriating foreign currency from the hundi.

హుండీ విదేశీ కరెన్సీ మాయం.. టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్

తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపులో భారీ అవకతవకలు వెలుగు చూసాయి. టీటీడీ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని దారి మళ్లించినట్లు టీటీడీ విజిలెన్స్ వింగ్ గుర్తించింది. ప్రతి నెల 1వ తేదీ పరకామణిలో జమ చేయాల్సిన విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కృష్ణ కుమార్ గత సంవత్సరం ఒక నెలలోనే రూ. 6 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాహా చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారం…

Read More
Devotee rush continues in Tirumala. A total of 79,478 devotees had darshan, with ₹4.05 crore recorded as hundi income.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల పాటు నిరీక్షణ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం 12 గంటల పాటు నిరీక్షణ అవసరమవుతోంది. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ అధికారులు క్యూలైన్లను విస్తరించి, భక్తులకు తాగునీరు, మజ్జిగ వంటి అవసరమైన సదుపాయాలు అందిస్తున్నారు. తలనీలాలు సమర్పించేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గత 24 గంటల్లో 79,478 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు సందడిగా…

Read More
AIYF leaders staged a semi-nude protest demanding the cancellation of the Sai Nagar brandy shop license in Tirupati Rural.

సాయి నగర్ బ్రాందీ షాపుకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ నిరసన

తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ గ్రామపంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తక్షణమే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్ర బాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శ్రీ పద్మావతి బైరాగి పట్టెడ రోడ్డునుండి అవిలాలకు వెళ్లే దారిలో ఉండే రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ బ్రాందీ షాపు ముందు అర్థనగ్న నిరసన…

Read More
TTD introduces Vada in Tirumala Annadanam. Daily, 35,000 Vadas will be served to devotees.

తిరుమల అన్నప్రసాదంలో కొత్తగా వడలు – టీటీడీ ప్రకటన

తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవలో కొత్తగా వడలను కూడా చేర్చారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా ప్రకటించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాద మెనూలో అదనంగా కొత్త పదార్థాన్ని చేర్చాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆమోదంతో వడలను వడ్డించాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు వడలను వడ్డిస్తామని…

Read More
Tirupati police conduct surprise checks on wrong-route violators, seizing vehicles and imposing fines.

తిరుపతిలో రాంగ్ రూట్ వాహనదారులపై ట్రాఫిక్ పోలీసుల చర్య

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ప్రాణాలకు ప్రమాదం తప్పదని తిరుపతి పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నగరంలోని ప్రధాన రహదారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ చారి, రూరల్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులను పట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై అధిక జరిమానాలు విధించడంతో…

Read More
Garland procession held for Garuda Seva in Srinivasamangapuram. The grand Swarna Rathotsavam is set to take place on February 23.

శ్రీనివాసమంగాపురంలో గరుడ సేవకు గోదా కల్యాణయాత్ర

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి 7 గంటలకు గరుడ సేవ వైభవంగా జరగనుంది. ఇందులో స్వామివారి అలంకరణ కోసం, ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఆండాళ్‌ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తుల భాగస్వామ్యంలో నిర్వహించిన ఈ గోదా కల్యాణయాత్ర భక్తుల హర్షాతిరేకాల నడుమ సాగింది. ఈ యాత్ర ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ప్రారంభమైంది. మాలల ఊరేగింపు ఎస్వీ గోసంరక్షణశాల, తాటితోపు, పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై…

Read More
Narayana school bus overturned in Tada; locals blame driver’s negligence. Injured students shifted to hospitals.

తడలో స్కూల్ బస్సు బోల్తా – విద్యార్థులకు గాయాలు

తడలోని బోడి లింగాలపాడు వద్ద SRM హోటల్ ఎదురుగా నారాయణ స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటన కలకలం రేపింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్కూల్ బస్సు సామర్థ్యాన్ని RTO అధికారులు సరిగా పరిశీలించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ స్పందిస్తూ, బస్సు “చాసిస్” విరిగిపోవడంతో కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడిందని తెలిపారు. అయితే, ఈ…

Read More