తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ – గాజు బాటిల్‌తో దాడి
తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొడుకును తోసిన విషయంపై జరిగిన మాటామాటా పెరిగి, ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. తొలుత వాగ్వాదంగా మొదలైన వివాదం, కొందరు భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘర్షణలో పదిమంది కలిసి ఓ భక్తుడిని చుట్టుముట్టి కొట్టారు. దీనికి ఆగ్రహించిన అతని తండ్రి చేతిలో ఉన్న గాజు బాటిల్‌ను తీసుకొని ఎదుటి వారిపై దాడి చేశాడు. గాజు బాటిల్ తలపై పడడంతో ఒక భక్తుడు తీవ్రంగా…
