శ్రీనివాసమంగాపురంలో గరుడ సేవకు గోదా కల్యాణయాత్ర
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి 7 గంటలకు గరుడ సేవ వైభవంగా జరగనుంది. ఇందులో స్వామివారి అలంకరణ కోసం, ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఆండాళ్ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తుల భాగస్వామ్యంలో నిర్వహించిన ఈ గోదా కల్యాణయాత్ర భక్తుల హర్షాతిరేకాల నడుమ సాగింది. ఈ యాత్ర ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ప్రారంభమైంది. మాలల ఊరేగింపు ఎస్వీ గోసంరక్షణశాల, తాటితోపు, పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై…
