Devotee rush continues in Tirumala. A total of 79,478 devotees had darshan, with ₹4.05 crore recorded as hundi income.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల పాటు నిరీక్షణ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం 12 గంటల పాటు నిరీక్షణ అవసరమవుతోంది. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ అధికారులు క్యూలైన్లను విస్తరించి, భక్తులకు తాగునీరు, మజ్జిగ వంటి అవసరమైన సదుపాయాలు అందిస్తున్నారు. తలనీలాలు సమర్పించేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గత 24 గంటల్లో 79,478 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు సందడిగా…

Read More
Task Force arrested 8 intruders in Srikalahasti forest area, seizing axes and a vehicle used for illegal activities.

శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 8మంది అరెస్టు – టాస్క్ ఫోర్స్ ఆపరేషన్

శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలోని అటవీప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3 పిడిలేని గొడ్డళ్లు, రవాణాకు ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక ఆదేశాలతో, ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో, ఆర్‌ఐ సాయి గిరిధర్, ఆర్‌ఎస్‌ఐ వినోద్ కుమార్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీమ్ శ్రీకాళహస్తి ఏర్పేడు…

Read More
AIYF leaders staged a semi-nude protest demanding the cancellation of the Sai Nagar brandy shop license in Tirupati Rural.

సాయి నగర్ బ్రాందీ షాపుకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ నిరసన

తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ గ్రామపంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తక్షణమే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్ర బాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శ్రీ పద్మావతి బైరాగి పట్టెడ రోడ్డునుండి అవిలాలకు వెళ్లే దారిలో ఉండే రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ బ్రాందీ షాపు ముందు అర్థనగ్న నిరసన…

Read More
TTD introduces Vada in Tirumala Annadanam. Daily, 35,000 Vadas will be served to devotees.

తిరుమల అన్నప్రసాదంలో కొత్తగా వడలు – టీటీడీ ప్రకటన

తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవలో కొత్తగా వడలను కూడా చేర్చారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా ప్రకటించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాద మెనూలో అదనంగా కొత్త పదార్థాన్ని చేర్చాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆమోదంతో వడలను వడ్డించాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు వడలను వడ్డిస్తామని…

Read More
Tirupati police conduct surprise checks on wrong-route violators, seizing vehicles and imposing fines.

తిరుపతిలో రాంగ్ రూట్ వాహనదారులపై ట్రాఫిక్ పోలీసుల చర్య

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ప్రాణాలకు ప్రమాదం తప్పదని తిరుపతి పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నగరంలోని ప్రధాన రహదారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ చారి, రూరల్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులను పట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై అధిక జరిమానాలు విధించడంతో…

Read More
MRP leaders paid candlelight tribute to Madiga martyrs in Venkatagiri for their sacrifice in SC classification movement.

మాదిగ అమరవీరులకు వెంకటగిరిలో క్యాండిల్ లైట్ నివాళి

ఉమ్మడి తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కాంపాలెం 25వ వార్డ్ మాదిగవాడలో మాదిగ అమరవీరులకు క్యాండిల్ లైట్ నివాళులు అర్పించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకత్వం నిర్వహించింది. ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం పోరాటం చేస్తూ అసువులు బాసిన మాదిగ బిడ్డలకు జోహార్ అంటూ నాయకులు నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడునెల్ల కాలంగా నిరంతరం పోరాటం సాగిస్తున్నామని, పాలకుల మోసపూరిత విధానాలను…

Read More
The Chandrababu government sanctioned ₹5 lakh for Sullurupeta hospital development, ensuring better medical facilities for the public.

సూళ్లూరుపేట ఆసుపత్రి అభివృద్ధికి రూ. 5 లక్షల నిధులు మంజూరు

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా ఆసుపత్రికి రూ. 5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక వ్యయంతో చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వ ఆసుపత్రులను మరింత అభివృద్ధి చేయడానికి…

Read More