టీటీడీ ఎజెండా లీక్ కలకలం, భూమన వ్యాఖ్యలతో వివాదం మళ్లీ చెలరేగింది
తిరుపతి, అక్టోబర్ 8:ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానం *తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)*లో మరోసారి అంతర్గత వివాదం చెలరేగింది. ఇంకా తేదీ కూడా ఖరారు కాని పాలకమండలి సమావేశానికి సంబంధించిన ఎజెండా వివరాలు ముందుగానే బయటపడటం పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఈ సమాచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakara Reddy) మీడియా ముందుకు రావడంతో ఈ అంశం చుట్టూ పెద్ద దుమారం రేగింది. దీంతో టీటీడీ ప్రస్తుత యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది….
