నెల్లూరులో 56 బైక్‌లతో దొంగల అరెస్ట్!
నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ సౌజన్య సూచనలతో రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి తప్పించుకుంటున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించి, కొడవలూరు మండలం పద్మనాభ సత్రం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అల్లూరికి చెందిన ఈ నలుగురు దొంగల వద్ద నుండి సుమారు 30 లక్షల విలువైన 56 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం…
