Minister Nadendla Manohar was warmly welcomed by Minister Anam Ramanarayana Reddy in Nellore. Leaders met to discuss various district matters.

నెల్లూరులో నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం

నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి విచ్చేసి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇద్దరు మంత్రులు జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, ప్రస్తుత సమస్యలు, పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మంత్రి నివాసానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు, జిల్లా…

Read More
DSP Srinivasa Rao announced the installation of 100 CCTV cameras in Buchireddypalem to curb crime.

బుచ్చిరెడ్డిపాలెంలో 100 సీసీ కెమెరాలతో క్రైమ్ నియంత్రణ

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో క్రైమ్ అరికట్టేందుకు పోలీసులు కొత్తగా 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర డిజిపి, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని డి.ఎస్.పి ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన రహదారులు, కాలేజీలు, పాఠశాలలు, వ్యాపార సముదాయాల వద్ద ఈ కెమెరాలను అమర్చుతామని ఆయన వెల్లడించారు. కేవలం క్రైమ్ నియంత్రణకే కాకుండా, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగర పంచాయతీలో ఖాళీ స్థలాలను పరిశీలించి, ఆటోలను సీరియల్…

Read More
Two women in Udayagiri, Nellore, exchanged fake gold for real ornaments; the shopkeeper realized the fraud and filed a police complaint.

నకిలీ బంగారంతో మోసం చేసిన ఇద్దరు కిలేడీలు!

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ బంగారం షాప్‌లో నకిలీ బంగారంతో మోసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఉదయం షాపుకు వచ్చిన ఇద్దరు మహిళలు 32 గ్రాముల నకిలీ బంగారం చైన్ ఇచ్చి, అసలైన బంగారు కమ్మలు, తాళిబొట్టు తీసుకెళ్లారు. వారు మాటలతో షాపు యజమానిని నమ్మించి వ్యాపార లావాదేవీ ముగించారు. కొద్దిసేపటికి యజమాని బంగారు చైన్‌ను పరిశీలించగా అది నకిలీ అని గుర్తించి ఒక్కసారిగా అవాక్కయ్యారు. అప్పటికే మహిళలు షాప్‌ను విడిచి వెళ్లిపోయారు. మోసపోయానని తెలుసుకున్న…

Read More
A speeding bus crashed into a petrol pump in Kovvur, narrowly avoiding a major disaster. All passengers are safe.

కోవూరు పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు

కోవూరు మండలం రామన్నపాలెం జాతీయ రహదారి వద్ద వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్తున్న నవయుగ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు రహదారి పక్కనే ఉన్న జయ ఫిల్లింగ్ స్టేషన్‌లోకి దూసుకెళ్లింది. పెట్రోల్ పంపును ఢీకొట్టినప్పటికీ, పెట్రోల్ లీక్ కాకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయం అందించారు. పోలీసుల వివరాల ప్రకారం, డ్రైవర్ అధిక వేగంతో ఉండటం, నిద్రమత్తు కారణంగా అదుపు…

Read More
Bank officials conducted loan interviews for BC, OBC beneficiaries under the corporation scheme in Kovvur.

కోవూరులో బీసీ, ఓబీసీ కార్పొరేషన్ లోన్ల ఇంటర్వ్యూలు

కోవూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో బీసీ, ఓబీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు బ్యాంకు లోన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీడీవో శ్రీహరి సమక్షంలో బ్యాంకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి, లబ్ధిదారుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, తమ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఎంపీడీవో శ్రీహరి మాట్లాడుతూ, లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, బ్యాంకులకు పంపించామని తెలిపారు. బ్యాంకులు లబ్ధిదారుల యూనిట్ విలువ, అవసరమైన లోన్ మొత్తం…

Read More
MLA Vemireddy Prashanthi Reddy discussed road margin vendors' issues in Kovvur and suggested solutions.

కోవూరులో రోడ్డు మార్జిన్ వ్యాపారుల సమస్యపై సమావేశం

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని చెన్నూరు రోడ్డులో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులను తొలగించడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ సుప్రజ, కౌన్సిలర్లతో కలిసి వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. చిరు వ్యాపారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా వ్యాపారం చేసుకునేలా వీలుచూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్థానిక కౌన్సిలర్లు, టీడీపీ నాయకులతో కలిసి వ్యాపారస్తుల సమస్యలను అర్థం చేసుకుని, వారికి సహాయపడేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు….

Read More
Jana Sena leaders take steps to restore the dilapidated Ayurvedic center in Kovvur, aiming to convert it into a 20-bed hospital.

కోవూరు లో శిథిలమైన ఆయుర్వేద కేంద్ర పునరుద్ధరణకు జనసేన

కోవూరు పట్టణంలోని కొత్తూరు రోడ్ లో గల 80 ఏళ్ల చరిత్ర కలిగిన సన్నపురెడ్డి శేషారెడ్డి ఆయుర్వేద వైద్యశాల పూర్తిగా శిథిలమైంది. ఈ విషయాన్ని గుర్తించిన జనసేన కోవూరు నియోజకవర్గ కెర్టేకర్ చప్పుడు శ్రీనివాసులు రెడ్డి ఆయుర్వేద కేంద్రాన్ని పరిశీలించారు. ఆయుర్వేద డాక్టర్ గంగాధర్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యపై మాట్లాడారు. శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఎంతోమంది దాతల సహాయంతో ప్రారంభమైన ఈ ఆయుర్వేద కేంద్రం ఇప్పుడు వినియోగం లేక శిథిలంగా…

Read More