Farmers in Patooru, Kovur, expressed anger over paddy procurement delays, criticizing officials for rejecting grains based on moisture content.

కోవూరు రైతుల ఆగ్రహం – ధాన్యం కొనుగోలుపై నిరసన

కోవూరు మండలం పాటూరులో వ్యవసాయ శాఖ జేడీ సీ. సత్యవాణి సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయగా, రైతులు తమ సమస్యలను ఉద్ధేశించి తీవ్రంగా మాట్లాడారు. తేమశాతం పేరుతో ధాన్యాన్ని కొలవడం లేదని, ఇప్పటికీ కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు లక్ష్మీశెట్టి శీనయ్య మాట్లాడుతూ, మూడునెలల క్రితమే ఎమ్మెల్యేకు ఈ సమస్య గురించి చెప్పినప్పటికీ, ఇప్పటికీ ఎటువంటి చర్యలు…

Read More
Trainee DSP Shiva Priya led vehicle checks in Inamadugu, Kovur. Fines were issued for rule violations, and some vehicles were seized.

ఇనమడుగు సెంటర్లో ట్రైని డీఎస్పి వాహన తనిఖీలు

కోవూరు మండలంలోని ఇనమడుగు సెంటర్లో ట్రైని డీఎస్పి శివ ప్రియ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి అనుమతులేని వాహనాలను పరిశీలించారు. రూల్స్ పాటించని వాహనదారులపై చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఫైన్లు విధించారు. అనుమతుల్లేని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నవారికి చలాన్లు విధించారు. రాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు…

Read More
MLA Prasanthi Reddy praised the 2025-26 AP budget, highlighting CM Chandrababu’s focus on economic growth and welfare.

2025-26 బడ్జెట్‌పై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ 2025-26 బడ్జెట్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశంసించారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన ఈ బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి కీలకంగా మారుతుందని అన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. పేదల బలోపేతం, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేశారని, స్వర్ణాంధ్ర – విజన్ 2047ను సాధించేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అసమర్థత వల్ల ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని తిరిగి…

Read More
Minister Narayana launched the monthly pension distribution in Bhagat Singh Colony, personally handing over pensions to beneficiaries.

భగత్ సింగ్ కాలనీలో మంత్రి నారాయణ ఎన్టీఆర్ భరోసా పంపిణీ

నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా ఒకటో తారీఖున ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ నిరభ్యంతరంగా జరుగుతుందని, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 68 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పింఛన్ల కోసం వృద్ధులను, వికలాంగులను సచివాలయాల చుట్టూ తిప్పేసిందని, ఇప్పుడు…

Read More
Commissioner Surya Teja directed officials to ensure smooth drainage flow in Nellore by taking necessary measures.

నెల్లూరులో డ్రైను కాలువల పునరుద్ధరణకు కమిషనర్ ఆదేశాలు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో డ్రైను కాలువల ద్వారా మురుగు నీటి పారుదల సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగాన్ని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. నగర పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించేందుకు కమిషనర్ శనివారం 5వ డివిజన్ సత్యనారాయణపురం, వైకుంఠపురం ప్రాంతాల్లో పర్యటించారు. డ్రైను కాలువలలో నీటి పారుదల సులభతరం అయ్యేందుకు ఏర్పాటు చేసిన ఐరన్ మెష్ లను సరిచేసేలా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కాలువల్లో చెత్త వేయకుండా నివారించేందుకు ప్రత్యేక…

Read More
MLA Vemireddy Prasanthi Reddy launched a plantation drive in Buchireddypalem with Teju Developers, planting 600 trees.

బుచ్చిరెడ్డిపాలెంలో తేజు డెవలపర్స్ సహకారంతో మొక్కల నాటకం

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో తేజు డెవలపర్స్ సహకారంతో డివైడర్‌పై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సుప్రజా మురళి, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తొలుత విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఓ విద్యార్థి భరతనాట్యం ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, తేజు డెవలపర్స్ సహకారంతో 600 మొక్కలు నాటించామని, వీటి సంరక్షణ…

Read More
Illegal soil transport continues in Mudivarthi village with 20 tractors. Despite police action, political pressure is enabling the mafia’s operations.

విడవలూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది

విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా 20 ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఘటన గ్రామస్తుల ఆందోళనకు కారణమైంది. ప్రభుత్వ భూములను టార్గెట్ చేస్తూ మాఫియా నిరభ్యంతరంగా దందా సాగిస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, నంబర్ ప్లేట్లు లేకుండా, లైసెన్స్ లేని డ్రైవర్లతో మట్టిని అధిక వేగంతో తరలిస్తున్న మాఫియా పోలీసులను సైతం లెక్కచేయడం…

Read More