Journalist Nageshwar Rao, facing health issues due to generic drugs provided at high costs by Pavan Medicals, has requested action from the Nellore Collector.

పవన్ మెడికల్స్‌ పై చర్యలు కోరుతూ జర్నలిస్ట్‌ వినతిపత్రం

*మందులపై డిస్కౌంట్ల పేరుతో ప్రజలను చీటింగ్ చేస్తున్న పవన్ మెడికల్స్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలి *పవన్ మెడికల్స్ ధన దాహానికి బలైన జర్నలిస్ట్ నాగేశ్వరరావు *వేరే బ్రాండ్లు మింగడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి విరోచనాలతో అస్వస్థతకు గురి అయిన జర్నలిస్ట్ నాగేశ్వరరావు *పవన్ మెడికల్స్ పై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన జర్నలిస్ట్ నాగేశ్వరరావు నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న పవన్ మెడికల్స్ ప్రజలను…

Read More
Minister Ponguru Narayana directs the use of drone cameras to monitor silt removal in irrigation canals. 50 crore funds allocated for the project.

ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులకు డ్రోన్ కేమరా పరిశీలన

ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించవలసిందిగా సంబంధిత అధికారులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు.శనివారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలసి ఇరిగేషన్, విద్యుత్ శాఖలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులకు ఇప్పటికే 50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, రెండు రోజుల్లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు….

Read More
Minister P. Narayana directed the officials to expedite property and sewage tax collections in Nellore Municipal Corporation for increased revenue, supporting city development projects.

నెల్లూరు నగరపాలక సంస్థలో పన్నుల వసూళ్ల వేగవంతం చేయాలని ఆదేశాలు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నులు, కుళాయి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులు ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ సూర్యతేజతో కలిసి మంత్రి నారాయణ పలు అంశాలపై మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా నగరంలో…

Read More
The Karthika Masam Laksha Deepotsavam began with grandeur in Nellore. The event, organized by VPR Foundation, was inaugurated by prominent leaders and featured religious rituals

కార్తీక మాస లక్ష దీపోత్సవం వైభవంగా ప్రారంభం

జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవం వైభవంగా ప్రారంభమైంది. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని విఆర్‌సి మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం శివ నామస్మరణల మధ్య గణపతి పూజతో ప్రారంభించారు. ముందుగా మైదానానికి వచ్చిన వేమిరెడ్డి దంపతులకు, వేమిరెడ్డి కోటారెడ్డి గారికి కార్తీక మాస లక్ష దీపోత్సవ…

Read More
Siblings Satwik and Preeti, who excelled in state-level school games, were honored with cash awards by Deputy MPP Narasimhareddy in Kovuru, encouraging their future success.

జాతీయ స్థాయికి ఎంపికైన సాత్విక్, ప్రీతిని సన్మానించిన కోవూరు ఉప ఎంపీపీ

కోవూరు మండల కేంద్రంలోని జేబీఆర్ హైస్కూల్‌లో జరిగిన 68వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌లో సాత్విక్, ప్రీతి అన్నాచెల్లెళ్లు తమ ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ క్రీడా విజయాన్ని పురస్కరించుకుని, వారిని పాఠశాలలో సన్మానించిన కోవూరు ఉప ఎంపీపీ శివుని నరసింహారెడ్డి వారికి బహుమతిగా ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున, మొత్తం పదివేల రూపాయలు అందజేశారు. సాత్విక్, ప్రీతి జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని, వారి విజయాలతో జిల్లాకు మంచి పేరు తెచ్చుకోవాలని నరసింహారెడ్డి…

Read More
In a ceremony at the Balija (Kapu) Bhavan in Nellore, Minister Narayana awarded scholarships to merit students, emphasizing TDP's support for education.

బలిజ మెరిట్ విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి నారాయణ

పేద విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌కు టీడీపీ ప్ర‌భుత్వం పెద్ద‌పీఠ వేస్తుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు. నెల్లూరులోని బ‌లిజ (కాపు) భ‌వ‌న్‌లో డాక్ట‌ర్ పోక‌ల ర‌వి స‌హ‌కారంతో బ‌లిజ మెరిట్ విద్యార్థుల‌కు పుర‌స్కారాలు అంద‌జేసే కార్య‌క్ర‌మంలో మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వ‌ళ‌న చేసి సభను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణను బ‌లిజ సంఘం నేత‌లు గజమాల, శలవాలతో ఘ‌నంగా స‌త్క‌రించారు. అక్క‌డికి విచ్చేసిన విద్యార్థుల‌తో మంత్రి…

Read More
Garden World, founded to promote environmental preservation, marked its first anniversary with special guests, offering discounts and distributing 100,000 plants.

గార్డెన్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ

నెల్లూరు రూరల్ పొట్టే పాలెం సమీపంలో జెట్టి నవీన్ కుమార్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గార్డెన్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవాన్ని బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితమ్మ, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, నారాయణ హాస్పిటల్ డీజీఎం అలిమిలి చంద్రశేఖర్ రెడ్డి, టిడిపి నేత ఇందుపూరు శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి…

Read More