నెల్లూరులో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ
నెల్లూరు సిటీలోని సండే మార్కెట్ వద్ద నోవా బ్లడ్ బ్యాంక్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నెల్లూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు డిస్టిక్ హోల్‌సేల్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు. రక్తదానంతో అనేకమందికి ప్రాణదానం చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.ఎస్ షిండే 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా 2000 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని నెల్లూరు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పేరూరి ప్రదీప్ వెల్లడించారు….
