రిళయన్స్‌కు 2600 ఎకరాల అవసరమా? భూముల వినియోగంపై సందేహం!
ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద పవర్ ప్రాజెక్ట్ కోసం 2008లో రిలయన్స్ సంస్థకు 2600 ఎకరాల భూమి కేటాయించారు. కానీ, 16 ఏళ్లుగా ఆ భూములు ఖాళీగానే ఉన్నాయి. పరిశ్రమలు అభివృద్ధి చేయాలని రైతులు భూమి త్యాగం చేసినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్ చేపట్టలేదు. దీనిపై అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భూమిని పరిశ్రమలకు కేటాయించిన తర్వాత రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కావాలని ఇండస్ట్రీయల్ పాలసీలో స్పష్టంగా ఉంది. నాలుగేళ్లైనా…
