నెల్లూరు జిల్లా కందుకూరులో దారుణం – మామూల్ల కోసం నర్సుపై ట్రాన్స్‌జెండర్ల దాడి, సీసీటీవీ ఫుటేజ్ వైరల్
నెల్లూరు జిల్లా కందుకూరులోని కోవూరు రోడ్డులో దసరా సందర్భంగా మామూల్లు ఇవ్వలేదనే కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా నర్సుపై ట్రాన్స్‌జెండర్లు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఈ అమానుష ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల ప్రకారం, ఆరుగురు ట్రాన్స్‌జెండర్లు మద్యం మత్తులో ఆ ప్రైవేట్ ఆసుపత్రిలోకి ప్రవేశించి, విధుల్లో ఉన్న నర్సు వద్దకు వెళ్లి దసరా పండుగ సందర్భంగా మామూలు డిమాండ్…
