
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై కమిషనర్ వి.కరుణ సమీక్ష
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగున్నప్పటికీ, మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహాయ సహకారాలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి.కరుణ తెలిపారు. ఆమె జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కమిషనర్ వి.కరుణ ఎంసీహెచ్ (మాత శిశు సంరక్షణ) విభాగం, ట్రైబల్ సెల్‌లలో రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. రోగుల కోసం సమర్థవంతమైన సేవలు అందించడం…