Collector A. Shyam Prasad inspected the MLC elections at Parvathipuram Junior College and guided officials.

పార్వతీపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను పరిశీలించిన కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతున్నదో లేదో పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. ఓటర్లు ఎలాంటి సమస్యలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షించి, విధుల్లో ఉన్న అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని…

Read More
On Maha Shivaratri, Annadanam was organized at Pedabondapalli Ramalingeshwara Swamy Temple, blessing thousands of devotees.

పెదబొండపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్నసంతర్పణ

పార్వతీపురం మండలం, పెదబొండపల్లి గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి, వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి కృపకు కృతజ్ఞతగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజల అనంతరం అన్నదానం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శివనామస్మరణలతో ఆలయం మారుమ్రోగగా, భక్తుల హర్షధ్వానాలతో పరిసరాలు…

Read More
CPM staged a protest demanding funds for Palakonda development, submitting a petition to the DT. They criticized the central and state governments.

పాలకొండ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సిపిఎం డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిటి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత దావాలా రమణారావు మాట్లాడుతూ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ సమస్యలు పెరిగాయని, కానీ మోడీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజలను విస్మరించిందని విమర్శించారు. ఈ బడ్జెట్ నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని, ముఖ్యమైన రంగాలకు…

Read More
Farmers’ association demands ₹20,000 per quintal support price for cashew in Parvathipuram Manyam, urging GCC to handle procurement.

జీడి మామిడి రైతులకు మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్న జీడి మామిడి రైతులు గిట్టుబాటు ధర లేకుండా దళారుల చేతిలో మోసపోతున్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే క్వింటాకు రూ. 20,000 మద్దతు ధర ప్రకటించి, జిసిసి ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని కోరారు. పార్వతీపురం ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించగా, జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్‌ను…

Read More
Left leaders demand action against attacks on journalists, urge protection of democratic rights.

విలేకరులపై దాడులు ఖండించిన వామపక్ష నేతలు

బుధవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో వామపక్ష పార్టీలు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఎం నాయకులు గొర్లి వెంకటరమణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. విలేకరులపై దాడులు పెరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు రెడ్డి వేణు, వి.ఇందిర, సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు, సిపిఐ ఎంఎల్ నాయకులు పి.రమణి, పి.సంఘం, సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ తదితరులు…

Read More
Sarpanches express anguish over lack of respect despite holding positions. YSRCP leaders submit a petition to the Collector over officials' attitude.

సర్పంచుల ఆవేదన – గౌరవం లేకుండా పోయిందని ఆరోపణ

సర్పంచులు తమ సమస్యలను అధికారులకు తెలియజేసేందుకు కలెక్టరేట్ వద్ద ముట్టడి చేశారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ ఇంచార్జ్ పరీక్షిత్ రాజు, ఇతర నాయకులు కలసి కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సర్పంచుల గౌరవం లేకుండా పోతుందనే ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తమకు తెలియకుండా ఉపాధి పనులు కేటాయిస్తున్నారని, అధికారుల వైఖరి శోచనీయమని ఆరోపించారు. పదవి ఉన్నప్పటికీ తమకు గౌరవం లేదని సర్పంచులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా…

Read More
M.V.S. Sharma urges to give first preference to Koredla Vijay Gauri, the PDF candidate.

కోరెడ్ల విజయ గౌరీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పిడిఎఫ్ సభ్యుల విజ్ఞప్తి

పార్వతీపురం సుందరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో, మాజీ శాసన మండలి సభ్యులు M.V.S. శర్మ ఆధ్వర్యంలో పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ, “ఉపాధ్యాయుల సమస్యలను ముందుకు తీసుకువెళ్ళే నాయకుడు కావలసిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యలను ఎవరు పట్టించుకోలేదు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా, శర్మ గారు కోరెడ్ల విజయ గౌరీ గారిని MLC పోటీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, ఓటు…

Read More