
సీతానగరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని సీతానగరం గ్రామం సమీపంలో సువర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు కొనసాగుతున్నాయని ఆలయ పూజారి పీసపాటి శ్రీనివాసచార్యులు తెలిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఆలయాన్ని పవిత్ర క్షేత్రంగా భావించి భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారికి ముడుపులు సమర్పిస్తున్నారు. అనేక మంది భక్తులు దీక్షలు…