బావిలో స్నానానికి దిగిన ఇద్దరు శివమాలధారులు మృతి
వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు శివ మాలధారులు బావిలో స్నానం చేయడం కోసం దిగారు. ఆ బావిలో లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందారు. మృతులలో జిడ్డు మల్లికార్జున (22), కామసాని రామకృష్ణ (27) ఉన్నారు. మరో శివ స్వామి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్థులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను వెలికితీసేందుకు…
