కోవూరు రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం
కోవూరు మండలం పడుగుపాడు ఎన్టీఎస్ రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా, కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేనంతగా ఉండటంతో వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ, స్థానికుల సమాచారంతో తాతాగారి హోటల్ వెనక రైల్వే పట్టాల పక్కన మృతదేహం ఉందని నిర్ధారించామని చెప్పారు. ప్రాథమికంగా చూస్తే, రైలు ఢీకొని మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు….
