కోవూరులో రోడ్డు మార్జిన్ వ్యాపారుల సమస్యపై సమావేశం
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని చెన్నూరు రోడ్డులో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులను తొలగించడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ సుప్రజ, కౌన్సిలర్లతో కలిసి వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. చిరు వ్యాపారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా వ్యాపారం చేసుకునేలా వీలుచూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్థానిక కౌన్సిలర్లు, టీడీపీ నాయకులతో కలిసి వ్యాపారస్తుల సమస్యలను అర్థం చేసుకుని, వారికి సహాయపడేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు….
