ఏపీ ఫైబర్ నెట్‌లో అస్తవ్యస్తం – జీవీ రెడ్డి తీవ్ర విమర్శలు
ఏపీ ఫైబర్ నెట్ లో తీవ్ర సంక్షోభం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయినా ఫైబర్ నెట్ కు ఒక్క రూపాయి ఆదాయం రాలేదని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి విమర్శించారు. ఉన్నతాధికారులు సహకరించడం లేదని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురిని తొలగించినట్టు గురువారం ప్రకటించారు. ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్ గంధంచెట్టు సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజలను తొలగించినట్టు తెలిపారు. గత ప్రభుత్వంతో…
