బుచ్చిరెడ్డిపాలెంలో 100 సీసీ కెమెరాలతో క్రైమ్ నియంత్రణ
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో క్రైమ్ అరికట్టేందుకు పోలీసులు కొత్తగా 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర డిజిపి, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని డి.ఎస్.పి ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన రహదారులు, కాలేజీలు, పాఠశాలలు, వ్యాపార సముదాయాల వద్ద ఈ కెమెరాలను అమర్చుతామని ఆయన వెల్లడించారు. కేవలం క్రైమ్ నియంత్రణకే కాకుండా, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగర పంచాయతీలో ఖాళీ స్థలాలను పరిశీలించి, ఆటోలను సీరియల్…
