నెల్లూరులో నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం
నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి విచ్చేసి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇద్దరు మంత్రులు జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, ప్రస్తుత సమస్యలు, పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మంత్రి నివాసానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు, జిల్లా…
