మదనపల్లిలో రెవెన్యూ అధికారులపై దాడిని ఏఐటీయూసీ ఖండింపు
మదనపల్లి రూరల్ తట్టివారిపల్లి పంచాయతీలో అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై భూ ఆక్రమణదారులు దాడి చేసిన ఘటనను ఏఐటీయూసీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణం, పరిసర ప్రాంతాల్లో గుట్టలు, వాగులు, వంకలు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణాలకు గురవుతున్నాయని…
