పాలకొండలో క్షుద్రపూజల ఆనవాళ్లు, స్థానికుల్లో భయం
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణం నడిబొడ్డున అర్ధరాత్రి పూట క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రహదారి మధ్యలో పసుపు, బొగ్గులు, నిమ్మకాయలు, గుడ్లు, కొబ్బరికాయలు ఉంచి, క్షుద్రపూజలకు గుర్తులా ఉన్న ముగ్గులు వేయడం స్థానికుల్లో అనేక అనుమానాలు రేకెత్తించింది. ఈ ఘటన నగరపంచాయితీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. శివాలయం వద్ద లింగోద్భవం కార్యక్రమం ముగించుకుని వస్తున్న మహిళలు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర అసహనానికి గురయ్యారు. అర్ధరాత్రి ఈ ప్రాంతంలో…
